వాస్తు ప్రశ్నలు – సమాధానాలు

स्थिरा वास्तु परामर्शदाता वास्तु योजना और दिशा संरेखण की समीक्षा करते हुए
Serene residential room with natural light and Vastu alignment
व्यावसायिक स्थान वास्तु परामर्श
वास्तु परामर्श और योजना
आवास में दिशा संरेखण
वास्तु पुरुष मंडल का विस्तृत चित्रण

వాస్తు శాస్త్రం

ఇంకా సందేహాలు లేదా ప్రశ్నలు ఉంటే, దయచేసి మమ్మల్ని సంప్రదించండి.

వాస్తు శాస్త్రం అంటే ఏమిటి?

వాస్తు శాస్త్రం అనేది భారతదేశంలో అభివృద్ధి చెందిన ప్రాచీన నిర్మాణ శాస్త్రం. 'వాస్తు' అంటే నివాసం, 'శాస్త్రం' అంటే శాసించేది లేదా రక్షించేది. ఆకాశం, భూమి, గాలి, నీరు, అగ్ని అను పంచభూతాల ఆధారంగా గృహాలు నిర్మించడం వల్ల సుఖ సంతోషాలు, ఆరోగ్యం, సంపద లభిస్తాయని వాస్తు శాస్త్రం నమ్మిస్తుంది.

వాస్తు శాస్త్రం ఎంత పురాతనమైనది?

వాస్తు శాస్త్రం 5,000 సంవత్సరాలకు పైగా పాత శాస్త్రం. మత్స్య పురాణం, అగ్ని పురాణం, విష్ణు ధర్మోత్తరం, భవిష్య పురాణాలలో వాస్తు ప్రకరణలు ఉన్నాయి. బృహత్సంహిత, అపరాజిత పృచ్ఛ వంటి గ్రంథాలలో వాస్తు నియమాలు వివరించబడ్డాయి.

వాస్తు శాస్త్రం మతపరమైనదా?

కాదు. వాస్తు శాస్త్రం ఏ మతానికి చెందినది కాదు. ఇది అన్ని మతాలవారికీ, అన్ని దేశాలకూ వర్తిస్తుంది. వాస్తు విశ్వంలోని సహజ శక్తులతో నివాసానికి సమతుల్యత కల్పించే విజ్ఞానం.

వాస్తు శాస్త్రం భారతదేశంలో మాత్రమే వర్తిస్తుందా?

కాదు. వాస్తు శాస్త్రం ప్రపంచంలో ఎక్కడైనా వర్తిస్తుంది. అయితే దక్షిణ అర్ధగోళ దేశాలైన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి చోట్ల కొన్ని నియమాలు భిన్నంగా ఉంటాయి. ఒక నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

వాస్తు దోషాలు మనపై ఎలాంటి ప్రభావం చూపుతాయి?

వాస్తు దోషాలు ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపారంలో నష్టాలు వంటివి కలిగిస్తాయని చెప్పబడింది. గృహంలో నివసించే అందరూ వాస్తు ఫలితాలు అనుభవిస్తారు కాబట్టి గృహ నిర్మాణంలో జాగ్రత్త అవసరం.

ఉచిత తొలి సంప్రదింపు

ఇంకా వాస్తు గురించి సందేహాలు లేదా సూచనలు అవసరమా? మా ఉచిత తొలి సంప్రదింపును వినియోగించుకోండి!

స్థలం ఎంపిక (Plot Selection)

ఇంకా సందేహాలు లేదా ప్రశ్నలు ఉంటే, దయచేసి మమ్మల్ని సంప్రదించండి.

వాస్తుకు అనుకూలమైన స్థలం ఆకారం ఏది?

చతురస్రాకారం (Square) మరియు దీర్ఘచతురస్రాకారం (Rectangle) వాస్తు రీత్యా అత్యంత శుభప్రదమైనవి. ఇవి ఆర్థిక వృద్ధి, స్థిరత్వం, అదృష్టం తెస్తాయని విశ్వాసం. త్రిభుజాకారం, L ఆకారం, అనియమిత ఆకారాలు వాస్తు దోషాలు కలిగిస్తాయి.

స్థలం వాలు ఏ దిశలో ఉండటం మంచిది?

తూర్పు మరియు ఉత్తర దిశలకు వాలుగా ఉన్న స్థలం శుభప్రదం. దక్షిణం నుండి ఉత్తరానికి వాలుగా ఉంటే ఆర్థిక నష్టాలు కలుగుతాయి. ఉత్తరం నుండి దక్షిణానికి వాలు అంటే ఉత్తరం ఎత్తుగా ఉందని - ఇది వాస్తు దోషం.

గోముఖి స్థలం మరియు శెర్ముఖి స్థలం అంటే ఏమిటి?

గోముఖి స్థలం అంటే వెనక వైపు వెడల్పుగా, ముందు వైపు సన్నగా ఉండే స్థలం. ఇది నివాసానికి అనుకూలం. శెర్ముఖి స్థలం అంటే ముందు వైపు వెడల్పుగా, వెనక వైపు సన్నగా ఉండే స్థలం. ఇది వ్యాపార నిర్మాణాలకు అనుకూలం.

వీధి పోటు (T-Junction) స్థలం కొనవచ్చా?

వీధి పోటు స్థలాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. దిశను బట్టి కొన్ని వీధి పోటులు మంచి ఫలితాలు, మరికొన్ని చెడు ఫలితాలు ఇస్తాయి. ఒక నిపుణ వాస్తు శాస్త్రవేత్తను సంప్రదించి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.

స్థలానికి ఎదురుగా రోడ్డు ఉంటే మంచిదా?

స్థలానికి ఎదురుగా రోడ్డు ఉండటం సాధారణంగా సమస్య కాదు. కానీ రోడ్డు నేరుగా ఇంటి ప్రధాన గుమ్మానికి తగిలే విధంగా ఉంటే దాన్ని వీధి శూల (T-Junction) అంటారు. ఇది దిశను బట్టి మంచి లేదా చెడు ఫలితాలు ఇవ్వవచ్చు, కాబట్టి వాస్తు నిపుణుడి పరిశీలన అవసరం. అలాగే, ప్రహరీ గుమ్మానికి ఎదురుగా బావి, గొయ్యి లేదా లోతైన గుంతలు ఉండకూడదు, ఇవి వాస్తు ప్రకారం అనుకూలం కావు.

ఉచిత తొలి సంప్రదింపు

ఇంకా వాస్తు గురించి సందేహాలు లేదా సూచనలు అవసరమా? మా ఉచిత తొలి సంప్రదింపును వినియోగించుకోండి!

ముఖ్య ద్వారం (Main Door / Entrance)

ఇంకా సందేహాలు లేదా ప్రశ్నలు ఉంటే, దయచేసి మమ్మల్ని సంప్రదించండి.

ముఖ్య ద్వారం ఏ దిశలో ఉండటం మంచిది?

తూర్పు, ఉత్తరం లేదా ఈశాన్యం (Northeast) వైపు ద్వారం ఉంటే చాలా మంచిదిగా భావిస్తారు. వాస్తు ప్రకారం 32 రకాల ద్వారాలలో 10 మాత్రమే శుభప్రదమైనవి. కాబట్టి వాస్తు నిపుణుడు చెప్పిన సరైన స్థానంలో ద్వారం పెట్టడం మంచిది.

దక్షిణం వైపు ద్వారం ఉంటే ఏమవుతుంది?

సాధారణంగా దక్షిణ ముఖ ద్వారం అంతగా మంచిది కాదని చెబుతారు. కానీ వాస్తు నిపుణులు చెబుతున్నట్టు, సరైన స్థానంలో (పాదంలో) ఉంటే దక్షిణ ద్వారం కూడా మంచిదే. ముఖ్యంగా పుషదంత లేదా సుగ్రీవ పాదంలో ఉంటే బాగుంటుంది.

ముఖ్య ద్వారం పెద్దగా ఉండాలా, చిన్నగా ఉండాలా?

ముఖ్య ద్వారం ఇంట్లోని మిగతా తలుపుల కంటే కొంచెం పెద్దగా ఉండాలి. తలుపు లోపలికి తెరుచుకోవాలి మరియు కుడివైపు (clockwise) తిరగడం మంచిది. అలాగే ద్వారం దగ్గర ప్రదేశం ఎప్పుడూ శుభ్రంగా, వెలుతురు ఉండేలా ఉంచాలి.

ప్రవేశ ద్వారం ముందు ఏమి ఉంచాలి?

ద్వారం ముందు రంగవల్లి వేయడం, లైట్ పెట్టడం మంచిది. స్వస్తిక్, ఓం వంటి శుభ చిహ్నాలు ఉంచవచ్చు. ముఖ్యంగా ద్వారం ముందు చెత్త లేదా ఎలాంటి అవరోధాలు ఉండకూడదు.

ఉచిత తొలి సంప్రదింపు

ఇంకా వాస్తు గురించి సందేహాలు లేదా సూచనలు అవసరమా? మా ఉచిత తొలి సంప్రదింపును వినియోగించుకోండి!

వంటగది వాస్తు (Kitchen Vastu)

ఇంకా సందేహాలు లేదా ప్రశ్నలు ఉంటే, దయచేసి మమ్మల్ని సంప్రదించండి.

వంటగది ఏ దిశలో ఉండాలి?

వంటగది ఆగ్నేయం (Southeast) వైపు ఉండటం చాలా మంచిది. ఎందుకంటే ఆ దిశ అగ్నికి సంబంధించినది. రెండో ఎంపికగా వాయువ్యం (Northwest) కూడా సరిపోతుంది. కానీ ఈశాన్యం, ఉత్తరం, తూర్పు వైపుల్లో వంటగది పెట్టడం మంచిది కాదు

వంటచేసేటప్పుడు ఏ దిశకు తిరిగి ఉండాలి?

వంట చేసేటప్పుడు తూర్పు వైపు చూసి వంట చేయడం ఉత్తమం. ఉత్తరం వైపు చూసినా సరే. తూర్పు దిశ సూర్యోదయ దిశ కాబట్టి, ఆ వైపు చూస్తూ వంట చేయడం ఆరోగ్యానికి మంచిదని నమ్మకం.

వంటగదిలో గ్యాస్ సిలిండర్ ఎక్కడ పెట్టాలి?

గ్యాస్ సిలిండర్, స్టవ్ అన్నీ ఆగ్నేయం (Southeast) వైపునే ఉంచాలి. అలాగే మిక్సర్, మైక్రోవేవ్, గ్రైండర్ లాంటి ఎలక్ట్రిక్ పరికరాలు కూడా అక్కడే పెట్టడం మంచిది. ఈశాన్యంలో స్టవ్ పెట్టకూడదు.

ఫ్రిడ్జ్ ఎక్కడ పెట్టాలి?

ఫ్రిడ్జ్‌ను వాయువ్యం (Northwest), ఆగ్నేయం (Southeast), దక్షిణం లేదా పశ్చిమంలో ఉంచవచ్చు. కానీ ఈశాన్యంలో పెట్టకూడదు.

వంటగదిలో సింక్ ఎక్కడ ఉండాలి?

సింక్ ఉత్తరం లేదా ఈశాన్యం వైపు ఉండటం మంచిది. నీటికి సంబంధించిన వస్తువులు ఈశాన్యంలో ఉంటే శుభంగా భావిస్తారు. అగ్ని (స్టవ్) మరియు నీరు (సింక్) ఒకదానికి ఎదురుగా లేదా చాలా దగ్గరగా ఉండకూడదు.

ఉచిత తొలి సంప్రదింపు

ఇంకా వాస్తు గురించి సందేహాలు లేదా సూచనలు అవసరమా? మా ఉచిత తొలి సంప్రదింపును వినియోగించుకోండి!

టాయ్లెట్ & బాత్రూమ్ వాస్తు (Toilet & Bathroom Vastu)

ఇంకా సందేహాలు లేదా ప్రశ్నలు ఉంటే, దయచేసి మమ్మల్ని సంప్రదించండి.

టాయ్లెట్ ఏ దిశలో ఉండాలి?

టాయ్లెట్ వాయువ్యం (Northwest) వైపు ఉండటం మంచిది. రెండో ఎంపికగా ఆగ్నేయం (Southeast) కూడా సరిపోతుంది. కానీ ఈశాన్యం (Northeast) లేదా ఇంటి మధ్యలో (బ్రహ్మస్థానం) టాయ్లెట్ పెట్టకూడదు.

టాయ్లెట్లో కూర్చున్నప్పుడు ఏ దిశకు తిరిగి ఉండాలి?

టాయ్లెట్‌లో కూర్చున్నప్పుడు ఉత్తరం లేదా దక్షిణం వైపు తిరిగి ఉండటం మంచిది. తూర్పు, పశ్చిమ దిశలు avoid చేయడం మంచిది.

పూజగది మరియు టాయ్లెట్ పక్కపక్కన ఉంటే ఏమవుతుంది?

పూజగది మరియు టాయ్లెట్ పక్కపక్కన ఉండకూడదు, ఒకే గోడ కూడా పంచుకోకూడదు. ఇది వాస్తు ప్రకారం మంచిది కాదు. అలాగే టాయ్లెట్‌కు ఎదురుగా మంచం పెట్టకూడదు.

బాత్రూమ్‌లో నీటి వనరులు ఎక్కడ ఉండాలి?

బాత్రూమ్‌లో నీటి పైపులు, ట్యాపులు ఉత్తరం వైపు ఉండటం మంచిది. నీరు బయటకు వెళ్లే దారి (drainage) ఉత్తరం లేదా వాయువ్యం వైపు ఉండటం మంచిది.

సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ ఉండాలి?

సెప్టిక్ ట్యాంక్‌ను ఉత్తరం, తూర్పు లేదా పశ్చిమంలో ఉంచవచ్చు. దక్షిణం వైపు పెట్టకూడదు. అలాగే ట్యాంక్ పొడవు తూర్పు-పశ్చిమ దిశలో ఉండటం మంచిది. ఇది ఇంటి గోడలకు చాలా దగ్గరగా ఉండకూడదు.

ఉచిత తొలి సంప్రదింపు

ఇంకా వాస్తు గురించి సందేహాలు లేదా సూచనలు అవసరమా? మా ఉచిత తొలి సంప్రదింపును వినియోగించుకోండి!

పూజగది వాస్తు (Pooja Room Vastu)

ఇంకా సందేహాలు లేదా ప్రశ్నలు ఉంటే, దయచేసి మమ్మల్ని సంప్రదించండి.

పూజగది ఏ దిశలో ఉండాలి?

పూజగది ఈశాన్యం (Northeast) వైపు ఉండటం అత్యంత మంచిది. ఇది పవిత్రమైన దిశగా భావిస్తారు. ఉత్తరం, తూర్పు దిశలు కూడా సరిపోతాయి. కానీ దక్షిణం వైపు పూజగది పెట్టకూడదు.

పూజ చేసేటప్పుడు ఏ దిశకు తిరిగి ఉండాలి?

పూజ చేసేటప్పుడు తూర్పు లేదా ఉత్తరం వైపు చూసి చేయడం మంచిది. ఈశాన్యం కూడా మంచిదే. పశ్చిమం వైపు చూసి పూజ చేయవచ్చు కానీ సాధారణంగా తూర్పు/ఉత్తరం ఉత్తమం.

మెట్ల కింద పూజగది నిర్మించవచ్చా?

లేదు, మెట్ల కింద పూజగది పెట్టకూడదు. ఇది పవిత్రతకు మంచిది కాదు. అలాగే పూజగది బెడ్రూమ్‌లో పెట్టడం కూడా avoid చేయాలి. డూప్లెక్స్ ఇళ్లలో సాధ్యమైతే పూజ స్థలం గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉండటం మంచిది.

పూజగదిలో విగ్రహాలు ఎంత ఎత్తులో ఉండాలి?

విగ్రహాలను నేల నుంచి కనీసం 6 అంగుళాల ఎత్తులో ఉంచాలి. అవి చాలా చిన్నగా (2 అంగుళాల కంటే తక్కువ) లేదా చాలా పెద్దగా (9 అంగుళాల కంటే ఎక్కువ) ఉండకూడదు. గోడకు పూర్తిగా అతికించకుండా, కొంచెం దూరం ఉంచాలి.

పూజగదిలో పగిలిన విగ్రహాలు ఉంచవచ్చా?

లేదు, పగిలిన విగ్రహాలు, చెదిరిన ఫోటోలు, ఎండిపోయిన పువ్వులు పూజగదిలో ఉంచకూడదు. ఇవి మంచిది కాదని భావిస్తారు. అలాగే మరణించిన వారి ఫోటోలు పూజగదిలో ఉంచకూడదు.

ఉచిత తొలి సంప్రదింపు

ఇంకా వాస్తు గురించి సందేహాలు లేదా సూచనలు అవసరమా? మా ఉచిత తొలి సంప్రదింపును వినియోగించుకోండి!

మెట్లు వాస్తు (Staircase Vastu)

ఇంకా సందేహాలు లేదా ప్రశ్నలు ఉంటే, దయచేసి మమ్మల్ని సంప్రదించండి.

మెట్లు ఏ దిశలో నిర్మించాలి?

మెట్లు దక్షిణం లేదా పశ్చిమం వైపు నిర్మించడం మంచిది. మెట్లు ఎక్కేటప్పుడు సవ్యదిశలో (clockwise) తిరిగేలా ఉండాలి. ఇంటి మధ్యలో మెట్లు నిర్మించడం మంచిది కాదు.

మెట్ల కింద ఏమి చేయవచ్చు?

మెట్ల కింద స్టోరేజ్‌గా ఉపయోగించవచ్చు. కానీ అక్కడ బాత్రూమ్, పూజగది లేదా వంటగది పెట్టకూడదు. ఇవి వాస్తు ప్రకారం మంచిది కాదని చెబుతారు.

మెట్ల అడుగుల సంఖ్య బేసి (Odd)గా ఉండాలా, సరి (Even)గా ఉండాలా?

మెట్ల సంఖ్య బేసి (Odd)గా ఉండటం మంచిది. బేసి సంఖ్యలు శుభంగా భావిస్తారు. అయితే 3తో భాగించే సంఖ్యలు (3, 9, 15, 21 వంటివి) avoid చేయడం మంచిది.

ఉచిత తొలి సంప్రదింపు

ఇంకా వాస్తు గురించి సందేహాలు లేదా సూచనలు అవసరమా? మా ఉచిత తొలి సంప్రదింపును వినియోగించుకోండి!

పెరడు, చెట్లు మరియు మొక్కలు (Garden, Trees & Plants)

ఇంకా సందేహాలు లేదా ప్రశ్నలు ఉంటే, దయచేసి మమ్మల్ని సంప్రదించండి.

ఇంట్లో మొక్కలు ఎక్కడ ఉంచాలి?

మొక్కలను తూర్పు లేదా ఉత్తరం వైపు ఉంచితే మంచిదిగా భావిస్తారు. మనీ ప్లాంట్‌ను ఆగ్నేయం (Southeast) వైపున ఉంచడం మంచిది. తులసి మొక్కను ఇంటి ముందు తూర్పు లేదా ఉత్తరం వైపున ఉంచితే శుభంగా ఉంటుంది.

వేప (Neem) మరియు రావి (Peepal) చెట్లు ఇంట్లో నాటవచ్చా?

రావి, వేప వంటి పెద్ద చెట్లు ఇంటికి చాలా దగ్గరగా, ముఖ్యంగా ముందు వైపున నాటకూడదు. ఇవి ఇంటి పునాదులకు నష్టం కలిగించే అవకాశం ఉంటుంది. పెద్ద చెట్లు దక్షిణం లేదా పశ్చిమం వైపు నాటితే మంచిది. ఉత్తరం, తూర్పు వైపులలో పెద్ద చెట్లు నాటడం నివారించడం మంచిది.

ఇంట్లో కాక్టస్ మరియు ముళ్ళ మొక్కలు ఉంచవచ్చా?

వాస్తు ప్రకారం కాక్టస్, ముళ్ళ మొక్కలు ఇంట్లో ఉంచకూడదు. ఇవి నెగటివ్ ఎనర్జీ, కలహాలు తీసుకొస్తాయని చెబుతారు. వీలైతే బయట పెరట్లో కూడా ఇవి పెట్టకుండా ఉండటం మంచిది.

ఉచిత తొలి సంప్రదింపు

ఇంకా వాస్తు గురించి సందేహాలు లేదా సూచనలు అవసరమా? మా ఉచిత తొలి సంప్రదింపును వినియోగించుకోండి!

నీటి వనరులు వాస్తు

ఇంకా సందేహాలు లేదా ప్రశ్నలు ఉంటే, దయచేసి మమ్మల్ని సంప్రదించండి.

బోరింగ్ / బావి ఎక్కడ తవ్వాలి?

బావి లేదా బోరింగ్‌ను ఈశాన్యం (Northeast) వైపు తవ్వడం అత్యంత మంచిది. గృహ నిర్మాణానికి ముందు ఈశాన్యంలో బోరింగ్ చేసి, ఆ నీటితోనే నిర్మాణం చేయడం శుభప్రదంగా భావిస్తారు. దక్షిణం లేదా నైరుతి (Southwest) వైపులలో బావి తవ్వకూడదు.

నీటి ట్యాంక్ (Overhead Tank) ఎక్కడ ఉంచాలి?

ఓవర్‌హెడ్ నీటి ట్యాంక్‌ను నైరుతి (Southwest) వైపున ఉంచడం మంచిది. ఈశాన్యంలో బరువైన ట్యాంక్ పెట్టకూడదు. భూగర్భ నీటి ట్యాంక్‌ను ఉత్తరం లేదా తూర్పు వైపున ఏర్పాటు చేయవచ్చు.

ఇంట్లో ఎక్కడ బరువైన వస్తువులు పెట్టాలి?

బరువైన వస్తువులు, ఫర్నిచర్‌ను నైరుతి (Southwest), దక్షిణం లేదా పశ్చిమం వైపులలో ఉంచడం మంచిది. ఈశాన్యం లేదా ఇంటి మధ్య భాగం (బ్రహ్మస్థానం)లో బరువైన వస్తువులు పెట్టకూడదు.

ఉచిత తొలి సంప్రదింపు

ఇంకా వాస్తు గురించి సందేహాలు లేదా సూచనలు అవసరమా? మా ఉచిత తొలి సంప్రదింపును వినియోగించుకోండి!

దిశలు మరియు వాటి ఫలితాలు (Directions & Their Effects)

ఇంకా సందేహాలు లేదా ప్రశ్నలు ఉంటే, దయచేసి మమ్మల్ని సంప్రదించండి.

తూర్పు ముఖ ఇల్లు మంచిదా?

తూర్పు ముఖ ఇల్లు ఆరోగ్యం, శాంతి, సంపదకు మంచిదిగా భావిస్తారు. ఉదయం సూర్యకాంతి నేరుగా ఇంట్లోకి రావడం వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. చదువు, ఆధ్యాత్మిక విషయాల్లో ఉన్నవారికి ఇది మరింత అనుకూలం. ద్వారం సరైన పాదంలో ఉంటే ఇంకా మంచిది.

ఉత్తరం ముఖ ఇల్లు ఎవరికి మంచిది?

ఉత్తరం ముఖ ఇల్లు ఆర్థికంగా ఎదగాలనుకునేవారికి, వ్యాపారస్తులకు మంచిది. ఉద్యోగులు, ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి కూడా ఇది అనుకూలం. ఉత్తర దిశను కుబేరుని దిశగా భావిస్తారు కాబట్టి ధనాభివృద్ధికి మంచిదని నమ్మకం.

దక్షిణం ముఖ ఇల్లు అశుభమా?

దక్షిణ ముఖ ఇల్లు చెడు అని అనుకోవడం ఒక అపోహ. ద్వారం సరైన స్థానంలో ఉంటే ఇది కూడా మంచిదే. ముఖ్యంగా వ్యాపారులు, మేనేజ్‌మెంట్‌లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. వాస్తు నిపుణుడి సలహా తీసుకోవడం మంచిది.

పశ్చిమ ముఖ ఇల్లు ఎంత మంచిది?

పశ్చిమ ముఖ ఇల్లు కూడా మంచిదే. ఇది సంతాన అభివృద్ధి, స్థిరత్వానికి సహాయపడుతుందని భావిస్తారు. సాయంత్రం సూర్యకాంతి ఎక్కువగా వస్తుంది. వ్యాపారులు, టీచర్లు వంటి వారికి ఇది అనుకూలం.

ఈశాన్యం (Northeast) దిశ ప్రత్యేకత ఏమిటి?

ఈశాన్యం అత్యంత పవిత్రమైన దిశగా భావిస్తారు. మానసిక శాంతి, ఆధ్యాత్మికత, జ్ఞానానికి ఇది చాలా మంచిది. ఈ దిశలో పూజగది, బావి లేదా ధ్యాన స్థలం ఉంచవచ్చు. ఈశాన్యాన్ని ఎప్పుడూ ఖాళీగా, తేలికగా ఉంచడం మంచిది.

ఉచిత తొలి సంప్రదింపు

ఇంకా వాస్తు గురించి సందేహాలు లేదా సూచనలు అవసరమా? మా ఉచిత తొలి సంప్రదింపును వినియోగించుకోండి!

రంగులు మరియు వాస్తు (Colors & Vastu)

ఇంకా సందేహాలు లేదా ప్రశ్నలు ఉంటే, దయచేసి మమ్మల్ని సంప్రదించండి.

ఇంటి గోడలకు ఏ రంగులు వేయాలి?

వాస్తు ప్రకారం లేత, సున్నితమైన రంగులు గోడలకు మంచివిగా భావిస్తారు. తెలుపు, క్రీమ్, లేత పసుపు, లేత నీలం, ఆకుపచ్చ, బేజ్ రంగులు అనుకూలం. చాలా ముదురు రంగులు, ముఖ్యంగా నల్ల రంగు ఎక్కువగా వాడకపోవడం మంచిది. ఇంటి బయట భాగానికి తెలుపు లేదా ఆఫ్-వైట్ బాగుంటుంది.

వంటగదికి ఏ రంగు వాడాలి?

వంటగదికి నారింజ, పసుపు, లేత ఆకుపచ్చ రంగులు బాగుంటాయి. ఇవి ఆగ్ని మూలకానికి సంబంధించిన రంగులుగా భావిస్తారు. చాలా ముదురు రంగులు వాడకపోవడం మంచిది. వంటగది ఎప్పుడూ వెలుతురు, గాలి బాగా వచ్చేలా ఉండాలి.

పూజగది గోడల రంగు ఏది ఉండాలి?

పూజగదికి తెలుపు, క్రీమ్, లేత పసుపు, లేత నీలం వంటి లేత రంగులు మంచివి. ఇవి ప్రశాంతతను ఇస్తాయని భావిస్తారు. ముదురు రంగులు వాడకపోవడం మంచిది. ఆకుపచ్చ రంగు కూడా శుభప్రదంగా భావిస్తారు.

ఉచిత తొలి సంప్రదింపు

ఇంకా వాస్తు గురించి సందేహాలు లేదా సూచనలు అవసరమా? మా ఉచిత తొలి సంప్రదింపును వినియోగించుకోండి!

వాస్తు దోషాలు మరియు పరిహారాలు (Vastu Doshas & Remedies)

ఇంకా సందేహాలు లేదా ప్రశ్నలు ఉంటే, దయచేసి మమ్మల్ని సంప్రదించండి.

ఇప్పటికే నిర్మించిన ఇంట్లో వాస్తు దోషాలు సరిచేయవచ్చా?

అవును, ఇప్పటికే నిర్మించిన ఇంట్లో కూడా వాస్తు దోషాలను కొంతవరకు సరిచేయవచ్చు. అద్దాలు, క్రిస్టల్స్, వాస్తు యంత్రాలు, రంగులు మార్చడం, మొక్కలు ఉంచడం వంటి చిన్న మార్పులతో వాతావరణాన్ని మెరుగుపరచవచ్చు. అవసరమైతే వాస్తు నిపుణుడి సలహా తీసుకోవడం మంచిది.

వాస్తు యంత్రాలు (Yantras) ఏమి చేస్తాయి?

వాస్తు యంత్రాలు సానుకూల శక్తిని పెంచడానికి ఉపయోగిస్తారని నమ్మకం. సంపద, ఆరోగ్యం, సంబంధాలకు సంబంధించిన వేర్వేరు యంత్రాలు ఉంటాయి. ఇవి నిపుణుడి సూచన ప్రకారం సరైన స్థానంలో ఉంచితే మంచిదిగా భావిస్తారు.

వాస్తు దోషం వల్ల ఇంట్లో ఏ సమస్యలు వస్తాయి?

వాస్తు దోషాల వల్ల ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు, నిద్రలో ఇబ్బందులు, ఉద్యోగంలో అడ్డంకులు వంటి సమస్యలు వస్తాయని నమ్మకం. ఇలాంటి సందర్భాల్లో నిపుణుడిని సంప్రదించడం మంచిది.

అద్దె ఇంట్లో వాస్తు వర్తిస్తుందా?

అవును, అద్దె ఇంట్లో ఉన్నా వాస్తు ప్రభావం ఉంటుందని భావిస్తారు. ఇంటి యజమాని, అద్దెదారులు ఇద్దరికీ ఇది వర్తిస్తుందని చెబుతారు. ఫర్నిచర్ అమరిక, రంగులు, మొక్కలు వంటి వాటితో కొంతవరకు వాస్తును మెరుగుపరచవచ్చు.

ఉచిత తొలి సంప్రదింపు

ఇంకా వాస్తు గురించి సందేహాలు లేదా సూచనలు అవసరమా? మా ఉచిత తొలి సంప్రదింపును వినియోగించుకోండి!

వ్యాపార మరియు కార్యాలయ వాస్తు (Office & Business Vastu)

ఇంకా సందేహాలు లేదా ప్రశ్నలు ఉంటే, దయచేసి మమ్మల్ని సంప్రదించండి.

వ్యాపార స్థలం ఏ దిశలో ఉండాలి?

వ్యాపార స్థలం ఉత్తరం, తూర్పు లేదా ఈశాన్యం వైపు ఉండటం మంచిదిగా భావిస్తారు. యజమాని లేదా మేనేజర్ దక్షిణం లేదా పశ్చిమం వైపు కూర్చొని, తూర్పు లేదా ఉత్తరం వైపు చూసి పని చేయడం మంచిది. ఉత్తరం దిశను ధనానికి సంబంధించినదిగా భావిస్తారు.

కార్యాలయంలో యజమాని ఏ దిశకు తిరిగి కూర్చోవాలి?

యజమాని తూర్పు లేదా ఉత్తరం వైపు చూసి కూర్చోవడం మంచిది. ఇది ఆర్థికంగా, నిర్ణయాల్లో కూడా సహాయపడుతుందని భావిస్తారు. దక్షిణం వైపు చూసి కూర్చోకపోవడం మంచిది. క్యాష్ కౌంటర్ ఉత్తరం వైపు ఉంటే అనుకూలంగా ఉంటుంది.

దుకాణం (Shop) వాస్తు ఎలా ఉండాలి?

దుకాణం ప్రవేశ ద్వారం తూర్పు, ఉత్తరం లేదా ఈశాన్యం వైపున ఉంటే మంచిది. నగదు పెట్టె (cash box) ఉత్తరం వైపున ఉంచడం శుభప్రదంగా భావిస్తారు. పూజ స్థలం ఉంటే ఈశాన్యంలో ఉంచాలి. దుకాణం ముందు ఎప్పుడూ వెలుతురు, శుభ్రత ఉండాలి.

ఉచిత తొలి సంప్రదింపు

ఇంకా వాస్తు గురించి సందేహాలు లేదా సూచనలు అవసరమా? మా ఉచిత తొలి సంప్రదింపును వినియోగించుకోండి!

అపార్ట్మెంట్ మరియు ఫ్లాట్ వాస్తు (Apartment & Flat Vastu)

ఇంకా సందేహాలు లేదా ప్రశ్నలు ఉంటే, దయచేసి మమ్మల్ని సంప్రదించండి.

అపార్ట్మెంట్లో వాస్తు నియమాలు వర్తిస్తాయా?

అవును, అపార్ట్మెంట్లలో కూడా వాస్తు నియమాలు వర్తిస్తాయని భావిస్తారు. పెద్ద మార్పులు చేయలేని పరిస్థితిలో, ఫర్నిచర్ అమరిక, రంగులు, అద్దాలు, మొక్కలు వంటి వాటితో కొంతవరకు వాస్తును మెరుగుపరచవచ్చు. ఈశాన్యం లేదా తూర్పు వైపు ప్రవేశం ఉండే ఫ్లాట్లు సాధారణంగా మంచివిగా భావిస్తారు.

అపార్ట్మెంట్లో ఏ అంతస్తు మంచిది?

వాస్తు ప్రకారం ఏ అంతస్తు అయినా సరే, ఫ్లాట్ లేఔట్ సరిగా ఉంటే మంచిదే. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఈశాన్యం లేదా ఉత్తరం వైపు ప్రవేశం ఉంటే మరింత అనుకూలంగా భావిస్తారు. పై అంతస్తులలో కూడా ఫ్లాట్ ప్లాన్ ముఖ్యమైనది.

ఫ్లాట్ కొనేటప్పుడు వాస్తు పరంగా ఏమి చూడాలి?

ఫ్లాట్ కొనేటప్పుడు తూర్పు లేదా ఈశాన్యం వైపు ప్రవేశం ఉండటం మంచిది. నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్, ఆగ్నేయంలో వంటగది, ఈశాన్యంలో పూజ స్థలం ఉండటం అనుకూలం. ఈశాన్యంలో టాయ్లెట్ లేదా ఇంటి మధ్యలో కిచెన్ ఉన్న ఫ్లాట్లు avoid చేయడం మంచిది.

ఉచిత తొలి సంప్రదింపు

ఇంకా వాస్తు గురించి సందేహాలు లేదా సూచనలు అవసరమా? మా ఉచిత తొలి సంప్రదింపును వినియోగించుకోండి!

బ్రహ్మస్థానం మరియు ఇంటి మధ్యభాగం (Brahmasthan)

ఇంకా సందేహాలు లేదా ప్రశ్నలు ఉంటే, దయచేసి మమ్మల్ని సంప్రదించండి.

బ్రహ్మస్థానం అంటే ఏమిటి?

బ్రహ్మస్థానం అంటే ఇంటి మధ్య భాగం. దీనిని ఇంటి శక్తి కేంద్రంగా భావిస్తారు. వాస్తు ప్రకారం ఇది చాలా పవిత్రమైన స్థానం. ఈ ప్రదేశం ఖాళీగా, వెలుతురు మరియు గాలి బాగా వచ్చేలా ఉంచడం మంచిది.

ఇంటి మధ్యలో ఏమి నిర్మించకూడదు?

ఇంటి మధ్య భాగంలో (బ్రహ్మస్థానంలో) టాయ్లెట్, వంటగది, బరువైన స్తంభాలు లేదా మూసివేసిన గదులు నిర్మించకపోవడం మంచిది. ఇది వాస్తు ప్రకారం అనుకూలంగా ఉండదు. మధ్యలో ఖాళీ ప్రదేశం లేదా లైట్ వెల్ ఉంచితే బాగుంటుంది.

ఉచిత తొలి సంప్రదింపు

ఇంకా వాస్తు గురించి సందేహాలు లేదా సూచనలు అవసరమా? మా ఉచిత తొలి సంప్రదింపును వినియోగించుకోండి!

కొన్ని వాస్తు సూచనలు

ఇంకా సందేహాలు లేదా ప్రశ్నలు ఉంటే, దయచేసి మమ్మల్ని సంప్రదించండి.

ఇంటిలో శుభ్రత వాస్తుకు అవసరమా?

అవును, శుభ్రత వాస్తులో చాలా ముఖ్యమైనది. చెత్త, పాత వస్తువులు, అనవసరమైన సామాను (clutter) ఇంట్లో ఉంచడం మంచిది కాదు. ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా, గాలి మరియు వెలుతురు బాగా వచ్చేలా ఉంచితే మంచి వాతావరణం ఏర్పడుతుంది.

ఇంట్లో ఎండిన పువ్వులు, పాత క్యాలెండర్లు ఉంచవచ్చా?

ఎండిన పువ్వులు, పాత క్యాలెండర్లు, పగిలిన లేదా పనిచేయని గడియారాలు ఇంట్లో ఉంచకపోవడం మంచిది. ఇవి నెగటివ్ ఎనర్జీకి కారణమవుతాయని నమ్మకం. గడియారం పనిచేయకపోతే దాన్ని వెంటనే సరిచేయడం లేదా తొలగించడం మంచిది.

ఇంట్లో తులసి మొక్క ఉంచడం మంచిదా?

అవును, తులసి మొక్క ఇంట్లో ఉంచడం చాలా శుభప్రదంగా భావిస్తారు. తులసిని ఇంటి ముందు తూర్పు లేదా ఉత్తరం వైపు ఉంచితే మంచిది. ఇది గాలిని శుభ్రపరచడంలో కూడా సహాయపడుతుంది.

ఇంట్లో మంచి వాస్తు కోసం ఏ విషయాలు పాటించాలి?

ఇంటిని శుభ్రంగా ఉంచాలి సహజ వెలుతురు, గాలి బాగా రావాలి నీటి లీకేజీలు వెంటనే సరిచేయాలి ప్రవేశ ద్వారం వెలుతురుగా, శుభ్రంగా ఉండాలి అనవసర వస్తువులు తొలగించాలి వంటగది ఆగ్నేయంలో, బెడ్రూమ్ నైరుతిలో, పూజగది ఈశాన్యంలో ఉండటం మంచిదిగా భావిస్తారు

వాస్తు ఎప్పుడు ఫలితాలు ఇస్తుంది?

వాస్తు మార్పుల ఫలితాలు వెంటనే రావచ్చు లేదా కొంత సమయం పట్టవచ్చు. ఒక ఇంటి నుంచి మరో ఇంటికి మారినప్పుడు లేదా మార్పులు చేసినప్పుడు కొంత కాలానికి సానుకూల మార్పులు కనిపిస్తాయని చెబుతారు. ఓపికగా ఉండటం మంచిది.

వాస్తు నిపుణుడిని ఎప్పుడు సంప్రదించాలి?

కొత్త ఇల్లు నిర్మించే ముందు, కొనుగోలు చేసే ముందు లేదా కార్యాలయం ప్రారంభించే ముందు నిపుణుడిని సంప్రదించడం మంచిది. ఇప్పటికే ఉన్న ఇంట్లో సమస్యలు తరచూ ఎదురైతే కూడా సలహా తీసుకోవచ్చు.

ఉచిత తొలి సంప్రదింపు

ఇంకా వాస్తు గురించి సందేహాలు లేదా సూచనలు అవసరమా? మా ఉచిత తొలి సంప్రదింపును వినియోగించుకోండి!

గమనిక:

ఈ సూచనలు సాధారణ మార్గదర్శకాలుగా అందించబడుతున్నాయి. వ్యక్తిగత పరిస్థితుల ఆధారంగా ఫలితాలు మారవచ్చు, కాబట్టి ముఖ్య నిర్ణయాల ముందు నిపుణుడి సలహా తీసుకోవడం మంచిది. ఈ సమాచారాన్ని మీరు మీ అవగాహనతో ఉపయోగించుకోవచ్చు.